మాట తప్పిన శిల్పా శెట్టి..అలా కనిపించి సర్‌ప్రైజ్ ఇచ్చిన నటి

-

బీ టౌన్ బ్యూటిఫుల్ అండ్ సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి..తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. పలు తెలుగు చిత్రాల్లో నటించిన ఈమె.. ఆ తర్వాత కాలంలో బాలీవుడ్ కే పరిమితమైంది. కాగా, ఇటీవల సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని, ఇక రానని చెప్తూ పోస్టు పెట్టింది. అంతలోనే మాట తప్పింది. సోషల్ మీడియా వేదికగానే తన నెక్స్ట్ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది.

సినిమాలు, ఓటీటీ ఒరిజినల్స్ షూటింగ్ లో ఫుల్ బిజీగా గడుపుతున్న శిల్పా శెట్టి.. తను నటిస్తున్న తాజా చిత్రం ‘నికమ్మ’ రిలీజ్ డేట్ అఫీషియల్ గా ప్రకటించేసింది. ఇందులో శిల్పా శెట్టి లుక్ కు సంబంధించిన వీడియో షేర్ చేసింది.

సదరు వీడియోలో వండర్ ఉమన్ గా దర్శనమిచ్చింది శిల్పా శెట్టి. ‘వండర్ ఉమన్’ క్యారికేచర్ లో చేతిలో కత్తి పట్టుకున్న శిల్పా శెట్టి ఒంటిలోకి కరెంటు ప్రవహిస్తున్నది. ‘‘సరికొత్త అవతార్ లో మాట్లాడుతున్నాం..అసలు ‘అవని’ ఎవరు? ఆమె పై కాస్త ప్రేమ చూపండి..రేపటి తేదీ గుర్తుంచుకోండి’ అని నోట్ రాసింది. ఈ నెల 17న(మంగళవారం) ఉదయం 11.30 గంటలకు ట్రైలర్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. శిల్పా శెట్టిని వెండితెరపైన చూసేందుకు అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news