12 మంది రెబెల్ ఎమ్మెల్యేలను డిస్ క్వాలిఫై చేయండి..స్పీకర్ కు శివసేన లేఖ

-

మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వం భారీ రాజకీయ సంక్షోభంలో ఉన్న వేళ,  12 మంది రెబెల్ ఎమ్మెల్యే లను డిస్ క్వాలిఫై చేయలని డిప్యూటీ స్పీకర్ నరహరి జెర్వాల్  కు శివసేన లేఖ రాశారు. బుధవారం జరిగిన LP సమావేశానికి హాజరు కాలేదని ..ఆ 12 మంది పై వేటు వేయాలని లేఖలో పేర్కోంది శివసేన పార్టీ.. 37 మంది కి పైగా రెబెల్ ఎమ్మెల్యే లు వుంటే షిండే తో సహా 12 మంది ఎమ్మెల్యే లపై వేటు వేయమని కోరడం పై శివసేన నంబర్ గేం ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

డిప్యూటీ స్పీకర్ నరహరి జెర్వాలే NCP పార్టీ కి చెందిన వారు కావడం శివ సేనకు అనుకూలంగా మారనుంది. ఫ్లోర్ టెస్ట్ లో తమ MVA కూటమి మెజారిటీ లో వుందా మైనారిటీలో వుందా అన్నది తేలుతుందని నిన్న వెల్లడించనున్నారు NCP చీఫ్ శరద్ పవార్. అటు ఇప్పటికే ఏక్ నాథ్ షిండేను తమ పక్ష నాయకుడుగా ఎన్నుకున్న రెబెల్ ఎమ్మెల్యేలు.. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆఫర్ పై ఇప్పటి వరకు స్పందించలేదు. స్పీకర్ గా వున్న నానా పటోల్ మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గా నియామకం కావడంతో డిప్యూటీ స్పీకర్ నరహరి జెర్వాలే కీలకం గా మారారు. దీనిపై ఇవాళ క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news