Breaking : ఆంధ్ర ప్ర‌దేశ్‌కు షాక్.. ప్ర‌త్యేక హోదా అజెండా తొలగింపు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని డిమాండ్ రాజ‌కీయ పార్టీలు చేస్తున్నాయి. ప్ర‌త్యేక హోదాపై కేంద్ర ప్ర‌భుత్వం ఎప్పుడూ సానుకూలంగా లేదు. ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం కూద‌ర‌ద‌ని ప‌లు సార్లు తెల్చి చెప్పింది. అయితే ఈ రోజు ఆంధ్ర ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా అంశం కేంద్రంలో చ‌ర్చ జ‌రుగుతుంద‌ని.. సోషల్ మీడియాలో తెగ ప్ర‌చారం అయింది. అంతే కాకుండా కేంద్ర ప్ర‌భుత్వం కూడా.. రేపు తెలుగు రాష్ట్రాల‌తో జ‌రగ‌బోయే.. స‌మావేశం అజెండాలో ఆంధ్ర ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదా అంశాన్ని చేర్చింది. అజెండాలో ఎనిమిదోవ అంశంగా ప్ర‌త్యేక హోదా అంశాన్ని చేర్చింది.

అయితే ప్ర‌త్యేక హోదాపై రేప‌టి స‌మావేశంలో చ‌ర్చ జ‌రుగుతుంద‌ని ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌జలు భావించారు. అయితే తాజా గా కేంద్ర ప్ర‌భుత్వం ఆంధ్ర ప్ర‌దేశ్‌కు షాక్ ఇచ్చింది. రేప‌టి స‌మావేశంలో అజెండా నుంచి ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా అనే అంశాన్ని తొల‌గించింది. దీంతో నేడు ఆంధ్ర ప్ర‌దేశ్ లో.. సోషల్ మీడియాలో జ‌రిగిన చ‌ర్చ.. ప్ర‌త్యేక హోదా ఆశ‌లపై కేంద్రం మ‌రో సారి నీళ్లు చ‌ల్లింది. కాగ ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా ఇస్తే.. బిహార్, ఒరిస్సా రాష్ట్రాల‌కు కూడా ఇవ్వాల‌ని.. అందుకే ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప‌లు సార్లు ప్ర‌క‌టించింది.

Read more RELATED
Recommended to you

Latest news