ఆరోగ్యం బాగుండాలంటే చలికాలంలో వీటిని తీసుకోండి..!

-

చలికాలంలో ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే చలికాలంలో అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలంటే తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చలికాలంలో ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది అనేది తెలుసుకుని దాని ప్రకారం అనుసరించాలి. అయితే చలికాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి..? ఎటువంటి పనులు చేయకూడదు అనే దాని గురించి చూద్దాం. మరి ఆలస్యం ఎందుకు ఇప్పుడే చూసేయండి.

చలికాలంలో ఎక్కువగా నూనెతో వండిన పదార్థాలను తీసుకోకూడదు.
అదేవిధంగా చలి కాలంలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. దీనితో ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. అయితే ఇలా అతిగా ఆహారం తీసుకోవడం వల్ల సమస్యలు వస్తాయి. కాబట్టి తగ్గించండి.
ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారం తీసుకోకూడదు. దీనితో బరువు పెరిగి.. ఒబిసిటీకి కూడా దారితీసే అవకాశం ఉంది.
చలికాలంలో పంచదారను తగ్గిస్తే మంచిది. పంచదారని టీ, కాఫీ లో వేసుకోకుండా మానేయడం మంచిది.
చలి కాలంలో సాల్ట్ ని ఎక్కువగా వాడద్దు. దీనివల్ల ఎముకలు బలహీనపడతాయి.
చలికాలంలో రాత్రిపూట ఎక్కువ హెవీగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోకూడదు.
ఎక్కువగా ఆకుకూరలు, క్యారెట్లు, ముల్లంగి వంటివి తీసుకోండి.
చలికాలంలో ఆరెంజ్, కివి, పైనాపిల్ వంటి పండ్లను తీసుకోండి.
చలికాలంలో డ్రై ఫ్రూట్స్ ను కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండండి.
అదే విధంగా చలికాలంలో రిఫైండ్ ఆయిల్ కి బదులుగా ఆవాల నూనె వాడండి. ఇలా ఈ మార్పులు మీరు చలికాలంలో చేస్తే ఆరోగ్యం మరింత బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news