ఐపీఎల్ 15వ సీజన్ లో భాగంగా నేడు 4 గంటలకు ముంబై ఇండియన్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరగనుంది. కాగ ఈ మ్యాచ్ కు ముందు ముంబై ఇండియన్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలినట్టు తెలుస్తుంది. ఈ మ్యాచ్ కు ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు.. సూర్య కుమార్ యాదవ్ దూరం కానున్నాడని సమాచారం. కాగ సూర్య కుమార్ యాదవ్.. శ్రీలంక టీ 20 సిరీస్ సమయంలో తీవ్రంగా గాయపడ్డాడు.
తన చేయి ఫాక్చర్ అయింది. దీంతో కొద్ది రోజుల పాటు చికిత్స చేసుకున్నాడు. అంతనరం బెంగళూర్ లోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్ నెస్ కోసం ట్రెనింగ్ తీసుకున్నాడు. క్వారైంటెన్ తర్వాత సూర్య కుమార్ యాదవ్ శనివారం జట్టుతో కలిసాడు. అయితే సూర్య కుమార్ యాదవ్.. పూర్తి ఫిట్ గా లేక పోవడం తో ఈ మ్యాచ్ కు అందుబాటులో ఉండే అవకాశాలు తక్కవగా ఉన్నాయని తెలుస్తుంది.
కాగ సూర్య కుమార్ యాదవ్ ను రిటెన్షన్ ప్రక్రియా లో రూ. 8 కోట్లు వెచ్చించింది. IPL లో 115 మ్యాచ్ లు ఆడిన సూర్య కుమార్ యాదవ్.. 135.7 స్ట్రైక్ రేట్ తో 2,341 పరుగులు చేశాడు. సూర్య కుమార్ యాదవ్ లేక పోవడం.. ముంబైకి లోటే అని చెప్పవచ్చు.