షాకింగ్ : కమెడియన్ కొడుకుతో యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు పెళ్లి…

-

తెలుగు మరియు తమిళ ప్రేక్షకులకు యాక్షన్ కింగ్ గా అదరగొట్టిన సీనియర్ హీరో అర్జున్ గురించి తెలిసిందే. ఇప్పటికీ కొన్ని సినిమాలలో కీలక పాత్రలు చేస్తూ నటనను కొనసాగిస్తున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ గురించిన విషయం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత కొంతకాలంగా ఐశ్వర్య అర్జున్ మరియు తమిళ కమెడియన్ తంబీ రామయ్య కుమారుడు ఉమాపతి రామయ్య లు ప్రేమలో ఉన్నారు. ఆ తర్వాత తమ ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబాలకు తెలియచేయడంతో, పెద్దవాళ్ళు మాట్లాడుకుని ఇద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారట.

ఈ సంవత్సరంలో ఉమాపతి రామయ్య పుట్టినరోజు ఉండడంతో.. ఆ రోజున పెళ్లి తేదీని ప్రకటించి వచ్చే ఏడాది పెళ్లి చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ఉమాపతి రామయ్య ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news