రెబల్ స్టార్ కృష్ఱంరాజు మరణించారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన రెబల్ స్టార్ కృష్ఱంరాజు.. 1940, జనవరి 20న మొగల్తూరులో జన్మించారు. ఇక ఆయన ఆకస్మిక మృతికి పలువురు సంతాపం తెలుపుతున్నారు. అయితే..రెబల్ స్టార్ కృష్ఱంరాజు మరణం వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పడ్డాయి.
పోస్ట్ కోవిడ్ సమస్యలు రావడంతో రెబల్ స్టార్ కృష్ణం రాజు అసుపత్రిలో జాయిన్ అయిన కృష్ఱంరాజు… అర్థరాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందారు. ఇప్పటికే రెండు సార్లు పోస్ట్ కోవిడ్ సమస్యలతో ఇబ్బంది.. పరిస్థితి అత్యంత విషమంగా మారి కన్నుమూశారు కృష్ణంరాజు. రెబల్ స్టార్ కృష్ణంరాజు హఠాత్ మరణంపై అధికారికంగా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది AIG ఆస్పత్రి బృందం.
ఇక అటు కృష్ణం రాజు (ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు) మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు.తన యాభై ఏండ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో హీరోగా నటించి, తన విలక్షణ నటనాశైలితో, ‘రెబల్ స్టార్’ గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం, తెలుగు వెండితెరకు తీరని లోటని సీఎం కేసిఆర్ పేర్కొన్నారు.