బేబమ్మ గురించి ఎవరికీ తెలియని షాకింగ్ విషయాలు..!!

-

కన్నడ ముద్దుగుమ్మ బేబమ్మ అలియాస్ కృతి శెట్టి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ రేసులో స్పీడుగా దూసుకుపోతోంది . ఉప్పెన సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఈమె మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుని ఆ తర్వాత స్టార్ హీరోలతో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఇక శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు లాంటి సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్న బేబమ్మ ఇటీవల ది వారియర్ సినిమాతో కూడా మంచి ఇమేజ్ను సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లోనే హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న హీరోయిన్గా రికార్డు సృష్టించింది ఈ ముద్దుగుమ్మ.

ఇకపోతే ప్రస్తుతం నితిన్ సరసన మాచర్ల నియోజకవర్గం సినిమా షూటింగ్లో బిజీగా ఉండగా.. మరొకవైపు సుధీర్ బాబు నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాలో కూడా నటిస్తోంది. ఈ రెండు సినిమాల తర్వాత నాగచైతన్య రెండవసారి జత కట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది బేబమ్మ. ఇదిలా ఉండక ఎప్పటికప్పుడు సినిమాలలోనే కాదు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఈమె గురించి ఎవరికీ తెలియని కొన్ని షాకింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

కృతి శెట్టికి సాధ్యమైనంతవరకు కోపం అనేది రాదట. ఒకవేళ వచ్చినా ఎవరితో ఏం మాట్లాడకుండా సైలెంట్ గా గదిలోకి వెళ్లి తలుపు వేసుకొని హాయిగా నిద్ర పోతుందట.

బేబమ్మ కు సెంటిమెంట్స్ చాలా ఎక్కువ .ఏదైనా సినిమా ప్రారంభించే ముందు తప్పకుండా దేవుడి దగ్గరికి వెళ్లి పూజ చేసి ఆ తర్వాత సినిమా షూటింగ్లో పాల్గొంటుందట.

సాధారణంగా చాలామంది హీరోయిన్లు ఎమోషనల్ సన్నివేశాలలో గ్లిజరిన్ వాడుతారు. కానీ బేబమ్మకు మాత్రం ఎవరైనా కొంచెం గట్టిగా అరిచినా సరే కన్నీళ్లు వచ్చేస్తాయట .ఇక అదే తన బలహీనత అని చెప్పుకొచ్చింది.

ఇకపోతే యాక్షన్ సినిమాలలో నటించాలని బాహుబలిలో అనుష్క లాంటి పాత్ర తన డ్రీమ్ రోల్ అని తెలిపింది.

అంతేకాదు శివ కార్తికేయన్ తన మొదటి క్రష్ అని కూడా తెలిపింది ఈ ముద్దుగుమ్మ.

Read more RELATED
Recommended to you

Latest news