అల్లు అర్జున్ కెరీర్ లో ఘోరమైన డిజాస్టర్ గా మిగిలిన చిత్రం ఏమిటంటే వరుడు అని చెప్పవచ్చు. ఈ సినిమాని డైరెక్టర్ గుణశేఖర్ అత్యంత భారీ బడ్జెట్ తో గ్రాఫిక్స్ తో తెరకెక్కించారు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ముఖ్యంగా ఈ సినిమా 5 రోజుల పెళ్లి కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రంలో విలన్ గా తమిళ హీరో ఆర్య నటించారు. మొదట ఈ సినిమాలో హీరోయిన్ ఫేస్ చూపించకుండా సడన్ ట్రీట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో హీరోయిన్గా నటించిన ఆమె పేరు భాను శ్రీ.
ఈ సినిమాలో ఇమెను చాలా సేపు సస్పెన్స్ లోనే ఉంచి చూపించారు డైరెక్టర్ గుణశేఖర్. అయితే అంతా సస్పెన్స్ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా తర్వాత భానుశ్రీకి ఆశించిన స్థాయిలో ఆఫర్లు కూడా రాలేకపోయాయి. కేవలం ఒకటి రెండు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో మాత్రమే నటించింది. వరుడు సినిమా కంటే ముందు ఈమె బాలీవుడ్ లో కూడా ఒక సినిమాలో అతిథి పాత్రలో నటించినట్లుగా తెలుస్తోంది.
ఇక టాలీవుడ్ లో మాత్రం చిలుకూరు బాలాజీ, ప్రేమతో చెప్పనా, మహారాజశ్రీ గాలిగాడు, లింగడు రామలింగడు అనే తెలుగు ప్రాజెక్టులలో నటించింది. ఇప్పుడు ఈ అమ్మడు ఎలా ఉంది ఏం చేస్తోంది అనే విషయం అభిమానులు గూగుల్లో తెగ సర్చింగ్ చేస్తున్నారు. తాజాగా ఈ అమ్మడికి సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. అయితే భాను శ్రీ ఫోటోలో మాత్రం అప్పటికి ఇప్పటికీ ఇమే మారలేదు అన్నట్లుగా కనిపిస్తోంది. ఈమె చివరిగా పదవ తరగతి డైరీ అనే చిత్రంలో నటించినట్లు తెలుస్తోంది.
View this post on Instagram