విరాట్ కోహ్లీ పెళ్లిపై షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు… అలా చేసిన తర్వాతే పెళ్లి చేసుకోవాల్సింది అంటూ..

-

పాకిస్తాన్ మాజీ క్రికెటర్, పేస్ బౌలర్ షోయబ్ అక్తర్ ఎప్పుడూ వార్తల్లో ఉంటాడు. క్రికెట్ పై ఏదో రకంగా తన సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తుంటారు. ముఖ్యంగా భారత్, పాక్ క్రికెటర్లపై తరుచుగా పలు వ్యాఖ్యలు చేస్తుంటారు. ఇటీవల ఇలానే అక్టోెబర్ లో జరుగబోయే టీ20 వరల్డ్ కప్ లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి కూడా టీమిండియాను పాక్ ఓడిస్తుందని.. టీమిండియా కన్నా పాక్ టీం బలంగా ఉందంటూ వ్యాఖ్యానించారు.

తాజాగా మరోసారి అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై ఆయన పెళ్లిపై వ్యాఖ్యలు చేశాడు అక్తర్. కోహ్లీ 120 సెంచరీలు చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాల్సిందని.. తాను విరాట్ కోహ్లీ స్థానంలో ఉంటే అలాగే చేసుండేవాడినంటూ వ్యాఖ్యానించారు. ఏదైమైనా కోహ్లీ నిర్ణయాన్ని మనమంతా గౌరవించాలి అని అన్నాడు ఈ షోయబ్ అక్తర్.

Read more RELATED
Recommended to you

Latest news