తెలంగాణాలో షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్, కెసిఆర్ కీలక ప్రకటన…!

-

తెలంగాణాలో ప్రజలు గనుక మాట వినకపోతే మాత్రం షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ జారీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కీలక ప్రకటన చేసారు. రాష్ట్రాన్ని రక్షించుకునే క్రమంలో ఏ నిర్ణయం అయినా తీసుకుంటామని కెసిఆర్ ప్రకటించారు. ఇప్పుడు ప్రజలు మాట వినకపోతే మాత్రం 24 గంటలు కర్ఫ్యూ విధిస్తామని అప్పటికి వినకపోతే మాత్రం కాల్చి చంపేస్తామని కెసిఆర్ కీలక హెచ్చరికలు జారీ చేసారు.

ప్రజాస్వామ్య దేశం కాబట్టి సున్నితంగా వ్యవహరిస్తున్నామని కీలక వ్యాఖ్య చేసారు.మాట వినకుంటే ఆర్మీ ని దించుతామని ఆయన ప్రకటించారు. సమాజానికి ఇబ్బంది కలిగే విధంగా చేస్తే మాత్రం ఎలాంటి లైసెన్స్ లు అయినా రద్దు చేస్తామని స్పష్టం చేసారు. కలెక్టర్లు, ఎస్పీలు కమీషనర్ల భేటీ లో కెసిఆర్ ఈ వ్యాఖ్యలు చేసారు. అందరూ హోం క్వారంటైన్ లో ఉండాలని, విదేశాల నుంచి వచ్చిన అందరి పాస్ పోర్ట్ లు కూడా కలెక్టరేట్ లో ఉండాలని ఆయన స్పష్టం చేసారు.

ఒక వైపు తెలంగాణాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 36 వరకు కరోనా కేసులు నమోదు అయ్యాయి. దేశంలో 500 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో ఒక్కసారిగా పరిస్థితి చేయి దాటినట్టు కనపడుతుంది. అనుమానితుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూ వస్తుంది. దీనితో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. నిర్లక్ష్యం చేస్తే పెద్ద ప్రమాదంలో పడతామని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news