ఆక్సిజన్ పెట్టుకున్నా లోపలి వెళ్ళలేకపొతున్నారు !

-

తెలంగాణ‌ వాటాకు వచ్చే శ్రీశైలం ఎడమ గట్టు కాలువ భూగ‌ర్భ జల విద్యుత్ కేంద్రంలో నిన్న రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. విద్యుత్ తయారీ కేంద్రంలో ఒక్క‌సారిగా మంటలు చెలరేగడంతో పాటు దట్టంగా పొగలు అలుముకోవ‌డంతో తొమ్మిది మంది పొగలో చిక్కుకున్నారు. ఘటనా స్థలానికి వచ్చిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లడారు. శ్రీశైలం ప్రాజెక్టు లెఫ్ట్ పవర్ హౌస్ లో ప్రమాదం దురదృష్టకరమని ఆయన అన్నారు. మొదటి యూనిట్లో ఫైర్ జరిగిందని, మొత్తం నాలుగు ప్యానెల్స్ దెబ్బతిన్నాయని అన్నారు.

jagade

పదిమంది బయటకు వచ్చారని, ఇంకా లోపల తొమ్మిది మంది చిక్కుకున్నారని అన్నారు. లోపల దట్టమైన పొగ ఉండటం వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని ఫైర్, పోలీస్ సిబ్బంది లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు వెళ్లారని మంత్రి అన్నారు. మూడు సార్లు లోపలికి వెళ్లి పొగతో వెనక్కు వచ్చారని, ఆక్సిజన్ పెట్టుకుని వెళ్లినా సంఘటనా స్థలానికి వెళ్ళ లేకపోతున్నారని అయన పేర్కొన్నారు. ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది లోపలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని, ఇప్పటికే సింగరేణి సిబ్బంది సహాయం కోరామని ఆయన అన్నారు. లోపల ఉన్న వారిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. జెన్ కో ఆసుపత్రిలో ఆరుగురు చికిత్స పొందుతున్నారని వారు సేఫ్ గానే ఉన్నారని మంత్రి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news