పరువు హత్య: యువకుడిని హత్య చేయించిన యువతి తల్లి!

-

అనంతపురం జిల్లాలో వరుస పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఉరవకొండలో హానర్ కిల్లింగ్ ఘటన మర్చిపోకముందే.. కనగానపల్లిలో అదే సీన్ రిపీట్ అయింది. తన కూతురు తక్కువ కులం అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనే కోపంతో యువతి తల్లి దారుణానికి పాల్పడింది. ముగ్గురు యువకులతో కలిసి కిడ్నాప్ చేయించి గొంతు కోసి చంపేసింది. కనగానపల్లికి చెందిన మురళి.. అదే గ్రామానికి చెందిన వీణతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరిదీ వేరువేరు సామాజిక వర్గాలు. దీంతో వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు.

పరువు హత్య
పరువు హత్య

పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న వీరిద్దరూ ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి చేసుకున్నారని తెలిసి యువతి తల్లి జీర్ణించుకోలేక పోయింది. దీంతో ఆమె బెదిరింపులకు పాల్పడింది. ఈ క్రమంలో డ్యూటీకి వెళ్లిన మురళీ తిరిగి ఇంటికి రాలేదు. కంగారు పడిన వీణ పోలీసులను ఆశ్రయించింది. దీంతో వారు గాలింపు చర్యలు చేపట్టగా.. మురళి విగతజీవిగా పడి ఉండటం కనిపించింది. తన భర్తను చూసిన వీణ కన్నీరుమున్నీరైంది.

తన తల్లి యశోదమ్మనే మురళిని చంపించిందంటూ వీణ ఆరోపించింది. మురళి హత్యపై కురుబ సామాజిక వర్గం నాయకులు ఆందోళనకు దిగారు. మురళిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని.. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news