నానితో రోమాన్స్‌కు సిద్ధమైన శ్రద్దాకపూర్

-

టాలీవుడ్‌​లో ఒక్క సినిమాతోనే సరిపెట్టుకుంది శ్రద్దాకపూర్​. ఆషికి 2 తో అన్ని భాషల్లో వచ్చిన క్రేజ్​తో సౌత్​లో గ్రాండ్​ ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా. కానీ, సాహో రిజల్ట్​ ఉసూరుమనిపించడంతో సైలెంట్​ అయ్యింది. ప్రస్తుతం ఓ క్రేజీ హీరోతో శ్రద్ధా జోడీ కట్టనుంది. న్యాచురల్​ స్టార్​ నాని తో ఈ హీరోయిన్​ నటించనుంది. అయితే, సినిమాలో కాదట. వీరిద్దరూ కలిసి ఓ యాడ్​లో నటిస్తున్నారు. హిందీలో బాలీవుడ్ ​హీరోతో.. తెలుగులో నానితో దీనిని ప్లాన్​ చేశారు.

 

Nani pairs-up with Shraddha Kapoor

అయితే, రెండింటిలో శ్రద్ధా మాత్రం కామన్​గా ఉంటుందట. దీంతో నాని ఫ్యాన్స్​ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ హీరో తన 30వ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇందులో సీతారామం ఫేం మృణాల్​ ఠాకూర్ ​ హీరోయిన్​గా నటిస్తోంది. ఇప్పటికే నాని ఓ రెండు కమర్షియల్​ యాడ్‌లో కనిపించాడు. దసరా సక్సెస్‌​తో ఊపుమీదున్న నాని యాడ్స్‌తో కనిపించి ఫ్యాన్స్​ను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే మహేశ్, అల్లు అర్జున్ వంటి హీరోలు ఈ ఫార్ములాతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news