Saindhav : ‘సైంధవ్’లో జెర్సీ హీరోయిన్.. ఫస్ట్ లుక్ రిలీజ్

-

ప్రస్తుతం శైలేశ్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్ ‘సైంధవ్’ అనే ఒక యాక్షన్ మూవీ చేస్తున్నారు. క్రితం ఏడాది ‘ఎఫ్ 3’ సినిమాతో ఆడియన్స్ కి కితకితలు పెట్టేశారు. అలాగే ‘ఓరి దేవుడా’ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రను పోషించారు. కెరియర్ పరంగా వెంకటేశ్ కి ఇది 75వ సినిమా. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకి, సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఈ సినిమా నుంచి వదిలిన ఫస్టు వీడియో చూడగానే, యాక్షన్ ఒక రేంజ్ లోనే ఉంటుందనే విషయం అర్థమైపోయింది.అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ పోస్టర్‌ రిలీజ్‌ అయింది. ఈ సినిమా నుంచి జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్ పోస్టర్‌ ను రిలీజ్ చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. కాగా.. ఈ ఏడాది డిసెంబర్ 22న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తం గా రిలీజ్ చేయనున్నట్టుగా చెబుతూ ఇప్పటికే ఒక పోస్టర్ ను వదిలారు.

Read more RELATED
Recommended to you

Latest news