బ్రేకప్​ రూమర్స్​కు చెక్ పెట్టిన శ్రుతి హాసన్

-

స్టార్ హీరోయిన్​ శ్రుతి హాసన్​ సినిమాల గురించి ఎంత చర్చ నడుస్తుందో.. అంతకు మించి ఆమె పర్సనల్ లైఫ్ గురించి చర్చ నడుస్తుంది. రీసెంట్​గా ఆమె తన బాయ్​ఫ్రెండ్​తో బ్రేకప్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా ఈ బ్యూటీ తన బ్రేకప్ వార్తలకు చెక్ పెట్టింది. తన బాయ్​ఫ్రెండ్​తో ఉన్న ఫొటో షేర్ చేసి శ్రుతి నెటిజన్లకు షాక్ ఇచ్చింది.

శ్రుతి కొన్నేళ్లుగా శాంతను హజారికతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల కాలంలో ఈ జంట విడిపోయిందనే వార్త నెట్టింట హల్‌చల్‌ చేసింది. ఇలాంటి వార్తలకు చెక్‌పెడుతూ శ్రుతి తన ఇన్‌స్టా స్టోరీలో శాంతనుతో ఉన్న ఫొటోను షేర్‌ చేసింది. ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ స్టార్‌ హీరోయిన్‌ ప్రియుడితో ఉన్న ఫొటోను పంచుకుంటూ ‘నేను కోరుకునేది ఇదే’ అనే క్యాప్షన్‌ జోడించింది. దీంతో బ్రేకప్‌ వార్తలకు చెక్‌ పడింది.

Read more RELATED
Recommended to you

Latest news