ఓటిటిలో చరిత్ర సృష్టించిన “శ్యామ్ సింగరాయ్”.. ప్రపంచంలోనే మూడో సినిమాగా రికార్డు

-

టాలీవుడ్‌ స్టార్‌ హీరో, నాచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటించిన తాజా సినిమా శ్యామ్‌ సింగరాయ్‌. ఈ మూవీ క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్ 24 వ తేదీన విడుదలై.. మంచి కలెక్షన్లను రాబడుతోంది. ముఖ్యంగా.. నాని రెండు డిఫరెంట్‌ లుక్స్‌ లో కనిపించి…అందరినీ కనువిందు చేశాడు. బెంగాల్ నేపథ్యం ఉన్న కథను తీసుకుని చిత్ర బందం ఓ సందేశం ఇచ్చింది.

ఈ సినిమా కు సాయిపల్లవి నటన చాలా పాజిటివ్‌ గా మారింది. ట్యాక్సీవాలా ఫేం రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌ లోనూ మంచి వసూళ్లను రాబడుతోంది. కాగా.. శ్యామ్‌ సింగరాయ్‌ జనవరి 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఓ టి టి లోనూ… ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సినిమాకు ఇప్పటి వరకు 35,90,000 వీక్షణలు వచ్చాయి. దీంతో ప్రపంచం లోనే {నెట్ ఫ్లిక్స్} లో వీక్షించిన మూడవ సినిమాగా చరిత్ర సృష్టించింది. అందులోనూ… రికార్డు సొంతం చేసుకున్న తొలి సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news