నెట్ ఫ్లిక్స్ తో హీరోయిన్ అనుష్క భారీ డీల్

-

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అయిన నెట్ ఫ్లిక్స్ తో బాలీవుడ్ హీరోయిన్, నిర్మాత అనుష్క భారీ ఒప్పందం చేసుకుంది. కాగ టీమిండియా క్రికెట‌ర్ విరాట్ కోహ్లి తో బాలీవుడ్ హీరోయిన అనుష్క శ‌ర్మ వివాహం జ‌రిగిన త‌ర్వాత హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా రాణిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ ల‌ను కూడా అనుష్క శ‌ర్మ నిర్మించింది. దీంతో హీరోయిన్ అనుష్క శ‌ర్మ‌తో క‌లిసి ప‌ని చేయ‌డానికి నెట్ ఫ్లిక్స్ ముందుకు వ‌చ్చింది.

దీని కోసం భారీ మొత్తం రూ. 400 కోట్ల డీల్ ను చేసుకుంది. దీంతో ఇప్ప‌టి నుంచి అనుష్క శ‌ర్మ నిర్మాణ సంస్థ‌, నెట్ ఫ్లిక్స్ సంయుక్తంగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంట‌రీల‌ను నిర్మించ‌నున్నారు. కాగ గ‌తంలో అనుష్క శ‌ర్మ.. అమెజాన్ ప్రైమ్ లోని పాతాళ్ లోక్ అనే వెబ్ సిరీస్ ను నెట్ ఫ్లిక్స్ లోని బుల్ బుల్ ను నిర్మించింది. ఈ రెండు కూడా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. దీంతో అనుష్క శ‌ర్మ‌కు ఈ భారీ ఆఫ‌ర్ వ‌చ్చింది. కాగ ప్ర‌స్తుతం టీమిండియా మ‌హిళా క్రికెట‌ర్ జుల‌న్ గో స్వామి బ‌యోపిక్ లో బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శ‌ర్మ న‌టిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news