తెలంగాణలో దారుణం : ట్రైనీ ఎస్సై పై ఎస్సై లైంగిక దాడి.. ట్రైనింగ్ పేరుతో మరీ!

-

మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఎస్ ఐ లైంగిక వేధింపులు గురి చేశాడంటూ ఉన్నతా ధికారులకు ఫిర్యాదు చేసింది ట్రైనీ ఎస్సై. ఇక ఇప్పటికే.. ఎస్ఐ పై చర్యలు తీసుకోని….తమకు న్యాయం చేయాలని పోలీసు ఉన్నతాధికారులు పిర్యాదు చేశారు ఆమె కుటుంబ సభ్యులు. ఆ బాధిత మహిళా దళిత యువతి కావడం గమనార్హం.

మరిపెడ ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. జరిగిన ఘటనపై న్యాయం జరగకుంటే ఉద్యోగానికి రాజీనామా చేస్తాను అని ఆ దళిత ట్రైనీ ఎస్సై ఆవేదన వ్యక్తం చేస్తోంది. కేసు విచారణ పేరుతో నిన్న రాత్రి ట్రైనీ ఎస్సైని ఫారెస్ట్ లోకి తీసుకొని వెళ్లి ఎస్సై శ్రీనివాస్ రెడ్డి.. వేధించినట్లు ఆరోపణ చేశారు ఆమె కుటుంబ సభ్యులు. అయితే ఈ విషయాన్ని బయటకు రాకుండా దాస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే న్యాయం కోసం వరంగల్ సీపీని కలిసేందుకు బాధితురాలు మరియు ఆమె కుటుంబ సభ్యులు ప్రయత్నం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news