ఎస్సై ఆత్మహత్యాయత్నం.. భార్య ఏం చేసిందంటే..?

-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం ఘటనలో సీఐ జితేందర్ రెడ్డి సహా నలుగురు కానిస్టేబుళ్లపై కేసు నమోదు అయింది. తన భర్త ఎస్సై శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటానికి సీఐ జితేందర్ రెడ్డి సహా కానిస్టేబుళ్లు శివ, సుభానీ, సన్యాసి నాయుడు, శేఖర్ కారణమని భార్య శ్రీరాముల కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కులవివక్ష, ప్రాంతీయ విభేదాలతో తన భర్తను వేధించారని ఫిర్యాదులో పేర్కొంది. కృష్ణవేణి ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ సెక్షన్ 306, 511 R/W 34 ఐపీసీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టారు. తన భర్త ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తన ఫోన్లో ఉన్నాయని సంబంధిత డేటాను భద్రపరిచి తనకు అందించాలని కృష్ణవేణి కోరింది. అశ్వారావుపేట ఎస్సై ఆత్మహత్యాయత్నం ఘటనలో వేధింపుల అభియోగాల నేపథ్యంలో సీఐ జితేందర్ రెడ్డిని ఐజీ కార్యాలయానికి, నలుగురు కానిస్టేబుళ్లను భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ పొలీసు శాఖ ఉత్తర్వ్యులు విడుదల చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓప్రైవేట్ ఆసుపత్రిలో ఎస్సై శ్రీనివాస్ చికిత్స పొందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news