ప్రభాస్ సినిమా కోసం కొత్త ప్రపంచమే రెడీ అవుతోంది.. నాగ్ అశ్విన్..

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్, ఆ తర్వాత చేస్తున్న సినిమాలన్నింటినీ దేశవ్యాప్త అభిమానులను దృష్టిలో ఉంచుకుని కథల్ని ఎంచుకుంటున్నాడు. ఐతే ఒక్క సినిమా మాత్రం ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చుదిద్దుకుంటుంది. అదే ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న సినిమా. మహానటి తర్వాత నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దానికి కారణం ఆ సినిమా తెరకెక్కుతున్న జోనర్ కొత్తది కావడమే.

సైంటిఫిక్ థ్రిల్లర్ అయినప్పటికీ ఇదివరకెప్పుడూ చూడని కొత్త ప్రపంచంలోకి తీసుకెళతాడట. ఈ మేరకు నాగ్ అశ్విన్ తన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాలు చెప్పుకొచ్చాడు. రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ చిత్రాలు పూర్తయిన తర్వాత రానున్న ఈ సినిమా చిత్రీకరణ మరికొద్ది రోజుల్లో మొదలవనుందట. ఈ మూడు చిత్రాల కారణంగా ప్రీ ప్రొడక్షన్ పనికోసం సమయం దొరికిందని, దానివల్ల పని మరింత సులువు అవుతుందని, ప్రేక్షకుల ఊహకు అందని కొత్త ప్రపంచం సృష్టించబడుతుందని చెప్పుకొచ్చాడు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాలో హీరోయిన్ గా దీపికా పదుకునే నటిస్తుంది. కీలకమైన పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపిస్తున్నారు.