పోస్టాఫీసు ఖాతాదారులు ఇలా ఈజీగా ఇంటర్‌నెట్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ని యాక్టివేట్ చెయ్యచ్చు..!

-

పోస్టాఫీసు ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. పైగా చాలా పొదుపు పధకాలను కూడా పోస్టాఫీసు ప్రవేశ పెట్టింది. ఇందులో తక్కువ మొత్తంతో ఖాతా ఓపెన్ చేయవచ్చు. బ్యాంకులో కంటే ఎక్కువ వడ్డీ వస్తుంది. పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు పెట్టడం వలన ఏ రిస్క్ ఉండదు. పూర్తి భద్రత, హామీ లభిస్తుంది.

ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు పోస్టాఫీసు తన కస్టమర్లకు మెరుగైన సౌకర్యాలను అందించేందుకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని తీసుకు రావడం జరిగింది. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. మీకు పోస్టాఫీసులో ఖాతా ఉంటే ఈ సదుపాయాన్ని వినియోగించుకోవడానికి అవుతుంది.

మీరు కనుక ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను పొందాలి అనుకుంటే… ఖాతాదారులు సబ్ పోస్ట్ ఆఫీస్ లేదా హెడ్ పోస్ట్ ఆఫీస్‌ లో సింగిల్ లేదా జాయింట్ ‘B’ సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉండాలి. బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ఖాతాలు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని పొందేందుకు అర్హత కలిగివుండాలి. ఇక మరి ఎలా ఇంటర్నెట్ బ్యాంకింగ్ కోసం ఇలా నమోదు చేసుకోవాలి అనేది చూద్దాం.

మీరు మీకు దగ్గర లో వుండే పోస్టాఫీసుకు వెళ్లి ఫారమ్‌ నింపండి. 48 గంటల్లో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు SMS వస్తుంది.
SMS అందుకున్న తర్వాత డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ (DoP) ఇంటర్నెట్ బ్యాంకింగ్ పోర్టల్‌కి వెళ్ళండి.
అక్కడ హోమ్ పేజీలో ‘న్యూ యూజర్ యాక్టివేషన్’ హైపర్‌ లింక్‌ పై క్లిక్ చేయాలి.
నెక్స్ట్ మీరు కస్టమర్ ID, ఖాతా IDని ఎంటర్ చేయాలి.
పూర్తి వివరాలను ఇచ్చాక మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ లావాదేవీల పాస్‌వర్డ్‌ను సెట్ చేయాలి. అయితే ఇవి రెండు వేరువేరుగా ఉండాలి చూసుకోండి.
ఇప్పుడు లాగిన్ అవ్వండి. మీ పాస్‌వర్డ్‌ను సెట్ చేస్తే ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్టివేట్ అవుతుంది.
అంతే ఇంట్లో నుండి ఇక PPF డిపాజిట్, PPF విత్‌డ్రా, RD డిపాజిట్, RD విత్‌డ్రాలు, సుకన్య సమృద్ధి ఖాతా కి సంబందించిన పనులు ఈజీగా చేసుకోచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news