కొత్త సంవత్సరంలో వచ్చేసాం కాబట్టి అంతా కొత్తగా ఉండాలనుకుంటాం. మరి కొత్తగా ఉండాలనుకున్నప్పుడు మీ ముఖంలో కొత్త అందం రావాల్సిందే కదా. మరి ఆ కొత్త అందం రావడానికి ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
చర్మ సంరక్షణ అనేది చాలా పెద్ద విషయం. వాతావరణం మారినప్పుడల్లా చర్మంలో జరిగే మార్పులు చర్మానికి అనేక ఇబ్బందులని తెచ్చిపెడుతుంటాయి. ఆ ఇబ్బందులని దూరం చేసుకుని నిగనిగలాడే చర్మం కోసం చిన్న చిన్న టిప్స్ తెలుసుకుంటే చాలా మంచిది.
ముఖం కడుక్కోవడం మర్చిపోవద్దు.
పైన లైన్ చదివి మాకు తెలియదా అనుకుంటే పొరపాటే. బయటకి వెళ్ళేటపుడు చాలా మంది మంచి ఫ్రెష్ గా రెడీ అయ్యి వెళ్తుంటారు. ఎంత ఫ్రెష్ గా రెడీ అయ్యి వెళ్ళారో అంత ఫ్రెష్ గా వచ్చాక కూడా రెడీ కావాలి. అంతే కాదు, నిద్రపోయే ముందు ఖచ్చితంగా ముఖం కడుక్కోవాలి. లేదంటే నల్లమచ్చలు వంటి సమస్యలు చాలా తొందరగా వచ్చేస్తాయి.
మాయిశ్చరైజర్ అస్సలు మర్చిపోవద్దు.
అది ఏ సీజన్ అయినా మాయిశ్చరైజర్ వాడటం మర్చిపోవద్దు. చర్మం పొడిగా మారితే వయస్సు పెరిగినట్టుగా అనిపిస్తుంది. అలా కాకుండా ఎల్లప్పుడూ యవ్వనంగా ఉండడానికి మాయిస్చరైజర్ మంచి సాయం చేస్తుంది.
కాటన్ ఫేస్ మాస్కులు మాత్రమే వాడాలి.
కరోనా వచ్చాక మాస్కుల వాడకం తప్పనిసరి. ఐతే ఏ మాస్క్ పడితే అది వాడకండి. కాటన్ మాస్కులు వాడితే చర్మానికి సౌకర్యంగా ఉంటుంది. లేదంటే మాస్క్ పెట్టుకున్న చోట మరకలు పడతాయి.
మీ స్మార్ట్ ఫోన్ శుభ్రంగా ఉంచుకోండి.
స్మార్ట్ ఫోన్ ని ఎంత శుభ్రంగ ఉంచుకుంటే అంత మంచిది. స్మార్ట్ ఫోన్ కి ఎన్నో బాక్టీరియాలు ఉంటాయి. దానివల్ల చర్మానికి ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే చర్మం శుభ్రంగా ఉంచుకోండి.