మీరు 10 సెకన్ల పాటు ఒంటి కాలు మీద నిలబడలేరా.. అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే?

-

మీరు కనీసం 10 సెకన్ల పాటు ఒంటి కాలు మీద నిలబడగలరా.. అలా చేయలేని 50 ఏళ్లు పైబడిన వారికి ఆరోగ్య సమస్యలు తప్పవని ఓ అధ్యయనం వెల్లడించింది. 10 సెకన్ల పాటు ఒంటి కాలు మీద నిలబడలేని మధ్య వయస్కులు పదేళ్లలో మరణించే ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం పేర్కొంది. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారు వచ్చే పదేళ్లలో మరణించే అవకాశం 84 శాతం ఉందని ఈ సర్వేలో వెల్లడైనట్లు తేలింది.

 

2009 నుంచి 1,702 మందిపై బ్రెజిల్​లోని ఓ సంస్థ చేసిన అధ్యయనం బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ ​లో ప్రచురితమైంది. ఈ పరీక్షలో భాగంగా ఒక కాలు భూమి మీద ఉంచి రెండో కాలును ఒక అడుగు పైకి లేపాలి. భూమి మీద ఉన్న కాలు వెనుకగా రెండో కాలును పెట్టాలి. ఈ టెస్ట్​లో ఒక్కొక్కరికి మూడు సార్లు అవకాశం ఇస్తారు. అందులో ఒక సారైనా పాసవ్వాలి. ఇలా చేసిన ఈ పరీక్ష​లో ప్రతి అయిదుగురిలో ఒకరు విఫలమయ్యారు.

బ్రెజిల్, ఫిన్లాండ్, ఆస్ట్రేలియా, యూకే, అమెరికాలో వృద్ధుల కోసం చేసే సాధారణ ఫిట్​నెస్​ టెస్ట్​లకు బ్యాలెన్సింగ్ పరీక్షను జోడించడం వల్ల వైద్యులకు కావలసిన ఆరోగ్య సమాచారం అందుతుందని పరిశోధకులు చెబుతున్నారు. సరిగా నిల్చునే సామర్థ్యం లేక కింద పడిపోయి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 6,80,000 కంటే ఎక్కువ మంది మరణిస్తున్నారని తెలిపారు. ఈ 10 సెకన్ల పరీక్ష ద్వారా అలాంటి ఇబ్బందులు ఉన్న వారెవరో తెలుసుకోవచ్చని పరిశోధకులు అంటున్నారు.

‘ఈ పరీక్ష చాలా సురక్షితమైనది. కేవలం ఒకటి లేదా రెండు నిమిషాల్లోనే పూర్తయిపోతుంది. ఇది రోగుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులకు తెలియజేస్తుంది.” అని పరిశోధకులు చెప్పారు. ఫిటినెస్ టెస్ట్​లో సఫలమైన వారితో పోల్చితో విఫలమైన వారి మరణ శాతం చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. ఫిటినెస్ టెస్ట్​లో ఫెయిలైనవారు 17.5 శాతం మంది మరణించగా, పాసైనవారు కేవలం 4.5 శాతం మంది మరణించారని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news