Telangana : పది పరీక్షలు.. ప్రతి కేంద్రంలో సిట్టింగ్‌ స్క్వాడ్‌

-

పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ క్రమంలో ఇవాళ్టి నుంచి జరిగే పరీక్షల్లో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలోనే పరీక్షలు జరుగుతున్న ప్రతి కేంద్రంలో సిట్టింగ్‌ స్క్వాడ్‌ను నియమిస్తున్నారు. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు.  రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్‌ సిబ్బందిని కూడా పర్యవేక్షణకు వినియోగించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఈక్రమంలో ఇవాళ జరిగే ఆంగ్లం పరీక్షతోపాటు మిగిలిన పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసి పర్యవేక్షణ పెంచాలని కలెక్టర్లు, ఎస్పీలు తమ పరిధిలోని రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్‌ శాఖల సిబ్బందికి అధికారులు ఆదేశాలు జారీచేశారు. క్రిమినల్‌ కేసులుండి, వ్యక్తిగత నేపథ్యం సరిగా లేని ఉపాధ్యాయులను విధుల నుంచి తొలగించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన డీఈఓలను ఆదేశించారు.

పదో తరగతి పరీక్షల్లో కాపీయింగ్‌ నిరోధానికి ఇప్పటివరకు ఫ్లయింగ్‌ స్క్వాడ్లను మాత్రమే నియమిస్తూ వస్తున్నారు. సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన (సీ-కేటగిరీ) 318 పరీక్షా కేంద్రాల్లోనే సిట్టింగ్‌ స్క్వాడ్లను నియమించారు. తాజా పరిణామాల నేపథ్యంలో మిగిలిన 2,334 కేంద్రాల్లోనూ సిట్టింగ్‌ స్క్వాడ్లను నియమిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news