మే 10వ తేదీ కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ రోజు ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి. మొదటి రౌండ్ నుండి కాంగ్రెస్ ఆధిక్యాన్ని కొనసాగించుకుంటూ వచ్చింది. అన్ని నియోజకవర్గాలలో
ఓట్లు లెక్కింపు పూర్తయ్యే సరికి కాంగ్రెస్ 136 సీట్లు, బీజేపీ 64, జేడీఎస్ 20 మరియు ఇతరులు నాలుగు సీట్లను సాధించారు. దీనితో బీజేపీ దారుణంగా ఓడిపోయి అప్రతిష్టను మూటగట్టుకుంది. ఇక ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అంత మెజారిటీ కాంగ్రెస్ కు దక్కింది. కాగా ఈ ఎన్నికలలో కాంగ్రెస్ తర్పవుం పోటీ చేసిన శివశంకరప్ప అనే వృద్ధుడు తన సమీప అభ్యర్థి బిజీ అజయ్ కుమార్ పై విజయాన్ని సాధించారు.
కాగా ప్రస్తుతం శివశంకరప్ప వయసు 92 కావడం గమనార్హం. ధావనగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచిన ఈయన రికార్డ్ సృష్టించాడు.