చర్మ సౌందర్యానికి కావాల్సిన చాలా వస్తువులు మార్కెట్లో విరివిగా దొరుకుతాయి. మనకేదీ కావాలన్నా ఈజీగా దొరికేస్తుంది. ఐతే చాలా మందికి ఏ ప్రోడక్ట్ ఎందుకు పనిచేస్తుందో సరిగ్గా తెలియదు. అదీగాక తమ చర్మం రకం ఏంటో తెలుసుకోకుండా మార్కెట్లో డిమాండ్ ఉందని చెప్పి, తమ చర్మానికి సూట్ అవని ప్రోడక్టులు వాడుతుంటారు. దానివల్ల వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఐతే చర్మం ఎలాంటిదైనా లాభం చేకూర్చే ప్రోడక్టులు చాలా తక్కువ ఉంటాయి. అలాంటి వాటిలో లోటస్ ఆయిల్ కూడా ఒకటి.
తామరపువ్వులో మనకి కావాల్సిన విటమిన్ బి, సి ఇంకా కాపర్, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఆరోగ్యాన్ని అందించి చర్మాన్ని సురక్షితంగా మారుస్తాయి.
చలికారణంగా చర్మంలో అనేక మార్పులు వస్తాయి. అంతకుముందు ఉన్న మెరిసేదనం కోల్పోయి పేలవంగా తయారయిన చర్మాన్ని లోటస్ అయిల్ అందంగా మార్చుతుంది. చనిపోయిన చర్మకణాలని తీసివేసి, కొత్త కణాలని పుట్టిస్తుంది. దానివల్ల చర్మానికి సరికొత్త అందం వస్తుంది.
వాతావరణంలో ఆర్ద్రత తగ్గిపోవడం వల్ల చర్మం తేమగా ఉండకుండా పొడిగా మారుతుంది. లోటస్ ఆయిల్ వల్ల పొడిబారిపోయిన చర్మం తేమగా మారుతుంది.
అంతేకాదు, ముఖంలో కనిపించే ముడుతల్ని తగ్గించి నల్లమచ్చలని తగ్గిస్తుంది. రోజూ వాడితే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయి.
వాడే విధానం:
సాధారణంగా డైరెక్టుగా ముఖానికి ఈ ఆయిల్ ని అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఫేస్ ప్యాక్ చేసుకున్నా బానే ఉంటుంది. వారంలో ఒక రెండుసార్లు చేస్తే చాలు మంచి ఫలితాలకి ఆస్కారం ఉంటుంది. ఇప్పటివరకు చర్మంపై చాలా ట్రై చేసి ఉంటారు. ఒక్కసారి లోటస్ ఆయిల్ వాడి చూడండి.