స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లో డబ్బులు పెడుతున్నారా..? అయితే బ్యాలెన్స్ ని ఇలా ఈజీగా చెక్ చేసుకోండి.. ఈ సర్వీసులు కూడా…

-

చాలా మంది నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతూ వుంటారు. ఈ స్కీమ్స్ లో డబ్బులు పెట్టడం వలన మంచిగా లాభాలను పొందొచ్చు. అయితే ఇది వరకు చూస్తే పాస్ బుక్ ని ప్రింట్ చేయించుకుంటే కానీ మనకి బ్యాలెన్స్ తెలిసేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు ఇ-పాస్‌బుక్ ఫీచర్‌ను తీసుకొచ్చారు. దీనితో చక్కటి బెనిఫిట్స్ ని పొందొచ్చు.

ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే.. స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ లో డబ్బులు పెట్టినవాళ్లు ఈజీగా బ్యాలెన్స్ చూడచ్చు. నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా యాక్సెస్ అవ్వక్కర్లేదు. అక్టోబర్ 12వ తేదీ నుంచి ఈ-పాస్‌బుక్ సదుపాయాన్ని తీసుకొచ్చారు. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉన్న ఫోన్‌ తో ఈ ఫీచర్ ని ఉపయోగించేందుకు అవుతుంది. దీని కోసం డబ్బులు కట్టక్కర్లేదు.

ఎలాంటి సేవలను పొందొచ్చు:

నేషనల్ సేవింగ్స్ స్కీమ్ ఖాతా యొక్క బ్యాలెన్స్‌ను ఈజీగా చూడచ్చు.
సుకన్య సమృద్ధిఖాతాలు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలు కోసం మినీ స్టేట్‌మెంట్‌లు మొదట పొందే అవకాశం వుంది. అలానే ఇతర పథకాలకు కూడా అందుబాటులో ఉండనున్నాయి.
పిపిఎఫ్, సేవింగ్ ఖాతా, సుకన్య సమృద్ధి ఖాతా బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవడానికి
ఇ-పాస్‌బుక్ ఫీచర్ ని ఉపయోగించచ్చు. www.indiapost.gov.in లేదా www.ippbonline.com లోకి వెళ్లి ఇ-పాస్‌బుక్ లింక్‌పై క్లిక్ చేయండి.
మీ మొబైల్ కి ఓటీపీ వస్తుంది. ఆ తరవాత మీకు కావాల్సిన వివరాలను ఈజీగా మీరు పొందొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news