ఇంట్లో ఈ చిన్నమార్పులతో భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి..!

-

భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటే ఇల్లు అంత ప్రశాంతంగా వెల్లివిరుస్తుంది. పిల్లలు కూడా ఆరోగ్యంగా.. ఆనందంగా ఉంటారు. అదే ఇంట్లో భార్య చీటికి మాటికి గొడవ పడుతుంటే ఏ మగాడికి ఇంటి ముఖం చూడాలనిపించదు. చిన్నదానికి పెద్దదానికి భర్త తగువు పెట్టుకుంటే ఏ మహిళకు ఇంట్లో క్షణం ఉండాలనిపించదు. పైపెచ్చు ఇల్లు నరకంలా అనిపిస్తుంది. అందుకే మీ ఇంట్లో తరచూ గొడవలు జరిగితే.. ఇంటి వాస్తులో ఏదో దోషం ఉన్నట్టే. అలాగని ఉన్న ఫళంగా ఇల్లు మారడమో.. రిపేర్లు చేయడమో అక్కర్లేదు. మీరున్న ఇంట్లోనే వాస్తుపరంగా చిన్నచిన్న మార్పులు చేస్తే చాలు మీ ఇంట్లో ప్రశాంతత పర్మినెంట్ గా ఉంటుంది. ఇంట్లో కొన్ని వస్తువులు చేర్చడం ద్వారా ఇంటి నిండి ఓ పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చేయొచ్చు. నెగెటివ్ ఎనర్జీని బయటకు తరిమేయొచ్చు. వాస్తు శాస్త్రాన్ని నమ్మేవాళ్లు ఈ స్టోరీ తప్పక చదవాల్సిందే..

ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కోసం మీరు చేయాల్సినవి ఇవే..

  • ఇంట్లో సంబంధ బాంధవ్యాలు బలహీనపడుతున్నట్టు అనిపించినా, నిత్యం గొడవలు అవుతున్నా తెల్ల చందనంతో చేసిన ఒక చెక్క విగ్రహాన్ని తెచ్చి పెట్టండి. ఇది చాలా శక్తివంతమైనది. గొడవలను తగ్గిస్తుంది. ప్రేమను పెంచుతుంది. కుటుంబసభ్యుల మధ్య పరస్పర విశ్వాసాన్ని పెంపొందిస్తుంది.
  • వాస్తు శాస్త్రం ప్రకారం ఉప్పు ఇంట్లో ఉన్న అన్ని ప్రతికూలతలను తొలగిస్తుందని నమ్ముతారు. గదిలోని ఒక మూలలో రాళ్ల ఉప్పు లేదా కళ్లుప్పుని వేసి నెల రోజుల పాటూ వదిలేయండి. ఒక నెల తరువాత దాన్ని తీసి కొత్త ఉప్పును వేయండి. ఇలా తరచూ చేస్తుంటే కుటుంబంలో శాంతి నెలకొంటుంది. కుటుంబ కలహాలు తగ్గుతాయి.
  • భోజనం చేసేటప్పుడు కుటుంబ సభ్యులంతా ఒకేసారి తినేందుకు ప్రయత్నించండి. వీలైతే వంటగదిలో తినేందుకు ప్రయత్నించండి. వంటగది పెద్దగా ఉంటేనే సాధ్యమవుతుంది. ఇల వంటగదిలో అందరూ కలిసి భోజనం చేయడం వల్ల రాహువు వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి.

  • బుద్ధ భగవానుడు శాంతి, సామరస్యాన్ని సూచిస్తాడు. కాబట్టే ఎక్కువ మంది ఇళ్లల్లో ఇతని విగ్రహం కనిపిస్తుంది. ఈ గదిలో లేదా బాల్కనీలో బుద్ధుని విగ్రహం ఉంచితే చాలా మంచిది. ఇల్లు శాంతంగా ఉంటుంది.
  •  కుటుంబంలో అధికంగా గొడవలు జరుగుతున్నప్పుడు ఎరుపు రంగు దుస్తులు వేసుకోవడం మానివేయాలి. ముఖ్యంగా కుటుంబంలో ఉన్న మహిళల మధ్య కలహాలు వచ్చినప్పుడు వారు ఎరుపు రంగు వస్త్రాలను ఒకే సమయంలో ధరించకూడదు.
  • కుటుంబంలోని మగవారి మధ్య విభేదాలు ఉంటే ఇంట్లో కదంబ చెట్టు కొమ్మను ఉంచాలి. ఇది ఇంట్లో శాంతిని నెలకొనేలా చేస్తుంది. విబేధాలు తగ్గిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news