మరోసారి నైనా జైస్వాల్‌కు వేధింపులు..

సోషల్ మీడియాను కొందరు మోసాలకు వాడుకుంటే, ఇంకొందరు విద్వేష ప్రచారలకు వాడుకుంటున్నారు. మరి కొందరు పోకిరీలేమో స్త్రీలను వేధించడానికే వాడుకుంటున్నారు. హైదరాబాదుకు చెందిన అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ కు ఇలాంటి ఆన్ లైన్ లో వేధింపులు ఎదురయ్యాయి. ఫేక్ ఐడీలతో యువతులను వేధిస్తున్న శాడిస్టులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. ఈ వేధింపులు ప్రముఖులకు కూడా తప్పడంలేదు. హైదరాబాద్ కు చెందిన అంతర్జాతీయ టేబుల్ టెన్నీస్ క్రీడా కారిణి నైనా జైస్వాల్ ను కొద్ది రోజులుగా ఓ పోకిరీ వేధిస్తున్నాడు.

Naina Jaiswal.. Harassment of sportswoman Naina Jaiswal IV News | irshi  Videos

శ్రీకాంత్‌ అనే యువకుడు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో నైనాకు అసభ్యకర మెసేజ్‌లు పంపుతున్నాడు. ఈ విషయంపై గతంలో కూడా నైనా జైస్వాల్ పోలీసులకు పిర్యాదు చేయగా అతనికి పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చి వదిలేశారు. అయినా అతని తీరు మారలేదు. ఇప్పుడు మళ్ళీ వేధింపులకు దిగాడు శ్రీకాంత్‌. కొంత కాలంగా ఈ వేధింపులు పెరగడంతో ఆమె మళ్ళీ పోలీసులను ఆశ్రయించింది. ఆమె తరపున‌ నైనా జైశ్వాల్‌ తండ్రి అశ్విన్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.