స్మార్ట్ ఫోన్ లో ఈ తప్పులు చెయ్యకండి.. హ్యాక్ అయిపోతుంది..!

-

ఇదివరకు బయట మాత్రమే మోసాలు జరిగేవి కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో స్మార్ట్ ఫోన్ హ్యాక్ చేయడం బ్యాంక్ ఖాతా కాళీ అయిపోవడం ఇటువంటివి జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. స్మార్ట్ ఫోన్ లో మనం గోప్యంగా వుంచుకున్నవి హ్యాక్ అయిపోవచ్చు కాబట్టి కొన్ని తప్పులను చేయకుండా జాగ్రత్తపడాలి. స్మార్ట్ ఫోన్ లో కొన్ని తప్పులు చేయడం వలన ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి అటువంటి తప్పులు చేయకుండా చూసుకోండి.

కొందరు వ్యక్తులు వ్యక్తిగత సమాచారాన్ని కూడా స్మార్ట్ ఫోన్ లో సేవ్ చేసుకుంటూ ఉంటారు ఇలాంటి అలవాటు మీకు కూడా ఉంటే వాటిని వెంటనే తొలగించడం మంచిది. ఏదైనా నోట్ కాపీలో రాసుకోవడం మంచిది. మీ స్మార్ట్ ఫోన్ లో వుండే డేటా భద్రంగా ఉండాలన్న హ్యాకింగ్ కి గురవకుండా సేఫ్ గా ఉండాలన్నా అస్సలు ఈ పొరపాటులని చేయకండి. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ లో యాప్స్ ను కేవలం గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేయాలి. అన్ అఫీషియల్ సోర్సుల నుండి థర్డ్ పార్టీ యాప్ స్టోర్స్ నుండి డౌన్లోడ్ చేయకూడదు దీని వలన బయట నుండి ఇన్స్టాల్ చేసుకున్న యాప్స్ లో మాల్వేర్ ఉండే ఛాన్స్ ఉంది దీని వలన ప్రమాదంలో పడతారు కాబట్టి ఇలా ఈ తప్పును చేయకండి.

ఫోన్లు అప్డేట్లని ఇస్తూ ఉంటాయి అప్డేట్ చేయడం చాలా మంది మర్చిపోతూ ఉంటారు. నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. నిజానికి అప్డేట్ చేస్తే ఏమైనా బగ్స్ వున్నా సెక్యూరిటీ కి సంబంధించి లోపాలు వున్నా కూడా ఫిక్స్ చేసుకోవచ్చు కాబట్టి అప్డేట్ విషయంలో స్పీడ్ గా ఉండండి. స్మార్ట్ ఫోన్లో పాత వెర్షన్ యాప్స్ ని కొందరు వాడతారు అలా కాకుండా యాప్ ని అప్డేట్ చేయడం కూడా ముఖ్యం. పబ్లిక్ వైఫై ని పొరపాటున కూడా వాడకండి దీని వలన కూడా మీ ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. డివైస్ సాఫ్ట్వేర్  మార్చాలనుకునే కొందరు స్మార్ట్ ఫోన్ లని రూట్ మారుస్తారు కానీ దీని వలన ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది ఇలా చేయడం అసలు మంచిది కాదు. స్మార్ట్ ఫోన్ హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే కచ్చితంగా ఈ జాగ్రత్తలు అని పాటించండి లేకపోతే హ్యాక్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news