పరిశ్రమలకు ప్రసిద్ధి గాంచిన కోయంబత్తూర్ పట్టణం లో ‘స్మార్ట్ ట్రీ ‘ ల ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సౌర శక్తితో పనిచేసే ఈ కృత్రిమ చెట్లకు జింక్ తో తయారు చేసిన ఆకులను అమర్చి , వాటికి బంగారు పూత పూశారు.
పైలెట్ ప్రాజెక్టులో భాగంగా తొలుత ఒక చెట్టును 600 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఈ చెట్టు వద్ద ఏకకాలంలో 30 మంది కూర్చో గల సామర్థ్యాన్ని కలిగి ఉన్న 5 బెంచీలు ఏర్పాటు చేశారు. ఈ చెట్టు పైన ఒక సోలార్ ప్యానెల్ ఉండి , సౌర శక్తిని ఉత్పత్తి చేసి , బ్యాటరీ లో నిలువ చేస్తుంది. రోజుకు 1500 వాట్ల పవర్ ను అందించగల సామర్థ్యం ఈ చెట్టుకు ఉంది.
పైగా ఈ చెట్టుకు వైఫై , ఛార్జింగ్ సౌకర్యాలు అందిస్తుంది. ఆ చెట్టు కింద కూర్చుని ఎవరైనా సరే మొబైల్ లేదా ల్యాప్ టాప్ లను ఛార్జింగ్ చేసుకోవచ్చు. కోయంబత్తూరు లో ఈ స్మార్ట్ ట్రీ ప్రాజెక్టు విజయం సాధిస్తే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.