Big Boss OTT Telugu: బాబా మాస్టర్ ఊర ‘మాస్’ స్టెప్పులు..కంటెస్టెంట్స్‌తో చిందులేయించిన కొరియోగ్రాఫర్

-

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ ఆరో సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఎనిమిదో వారంలో బాబా మాస్టర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చేశారు. హౌజ్ లోకి బాబా మాస్టర్ వస్తారని తెలుసుకుని కంటెస్టెంట్స్ హ్యాపీగా ఫీలయ్యారు. ఏడో వారం హౌజ్ నుంచి మహేశ్ విట్టా ఎలిమినేట్ అయిన సంగతి అందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ప్లేస్ ను బాబా మాస్టార్ రిప్లేస్ చేసినట్లయింది.

బాబా మస్టర్ ఎంట్రీ కి సంబంధించిన 51వ రోజు ప్రోమోను బిగ్ బాస్ నిర్వాహకులు రిలీజ్ చేయగా, సోషల్ మీడియాలో అది బాగా వైరలవుతోంది. సదరు ప్రోమోలో బాబా మాస్టర్ తన స్టెప్పులతో పిచ్చెక్కించారు. కంటెస్టెంట్స్ అందరూ ఒక్కొక్కరుగా బాబా మాస్టర్ ను ఇమిటేట్ చేయబోయి నవ్వుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ లో బాబా మాస్టర్ మేనరిజమ్స్ చేశారు.

ఇక చివరలో కంటెస్టెంట్స్ తో ముచ్చటించేందుకు బాబా మాస్టర్ గేటు మీద నుంచి దూకేశారు. ఈ వారం ఆరుగురి నామినేషన్స్ ఉండబోతున్నాయని చెప్పి..కంటెస్టెంట్స్ హౌజ్ హాల్ నుంచి లోపలికి తీసుకుపోతున్నట్లు ప్రోమోలో కనబడుతోంది. అంతటితో ప్రోమో ముగిసింది. తర్వాత ఏం జరుగుతుందనేది తెలియాలంటే మంగళవారం రాత్రి 9 గంటలకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news