ల్యాప్ టాప్ పేలి యువతికి గాయాలు

-

ల్యాప్ టాప్ పేలిన ఘటనలో ఓ యువతికి తీవ్ర గాయాలయ్యాయి.కరోనా కారణంగా చాలా కంపెనీల నిర్ణయాలలో మార్పు వచ్చింది.చాలా మంది వర్క్ ఫ్రం హోం విధానానికి జై కొడుతున్నారు.ఇందులో భాగంగానే ఇళ్ల వద్ద ఉండి పని చేస్తున్న క్రమంలో ఏమరపాటు కారణంగా కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.తాజాగా ఓ యువతి చార్జింగ్ లో ఉంచిన ల్యాప్టాప్ వాడుతుండగా అది పేలింది.దీంతో బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి.వివరాల్లోకి వెళితే…ఏపీ లోని కడప జిల్లా బీ కోడూరు మండలం మేకవారిపల్లె కు చెందిన సుమలత బీటెక్ పూర్తి చేసింది.బెంగళూరులోనిి యాజిక్ టెక్ పొల్యూషన్ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది.

కరోనా కారణంగా ఆ కంపెనీ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ సౌలభ్యాన్ని కల్పించింది.దీంతో ఆమె ఇంటి వద్దనే ఆఫీస్ వర్క్ చేస్తుంది.ఈ క్రమంలో సోమవారం ల్యాప్ టాప్ లో చార్జింగ్ అయిపోతున్న విషయాన్ని గమనించి 10 శాతం మాత్రమే చార్జింగ్ ఉండడంతో కేబుల్ ను స్విచ్ బోర్డు ప్లగ్ కు కనెక్ట్ చేసింది.ఆ తర్వాత యధావిధిగా వర్క్ లో మునిగి పోయింది.ఓవైపు ల్యాప్ టాప్ హీట్ అవుతున్న గమనించలేదు దీంతో ఒక్కసారిగా అది పేలిపోయింది.ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.ఆమె శరీరంలో 40 శాతం మేర కాలిన గాయాలు ఉన్నాయని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news