ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్స్ ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అవసరం ఉన్నా లేకపోయినా కూడా స్మార్ట్ ఫోన్ ని ఉపయోగిస్తున్నారు. బోర్ కొట్టినా లేకపోయినా ఏదైనా పని వున్నా పని లేకపోయినా స్మార్ట్ ఫోన్లో మునిగిపోతున్నారు. ఎక్కువసేపు మొబైల్ ని ఉపయోగించడం వలన రకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఫోన్ ఉపయోగిస్తే కచ్చితంగా మీ ఆరోగ్యం పై అది ప్రభావం చూపిస్తుంది. స్మార్ట్ ఫోన్ కి ఈ రోజుల్లో ఎక్కువమంది బానిసలు అవుతున్నారు. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ స్మార్ట్ ఫోన్ కి ఎడిక్ట్ అయిపోయారు. స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం వలన పురుషుల్లో పలు రకాలు సమస్యలు కలుగుతాయి. అది నిజంగా ఎంతో ప్రమాదకరం.
స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం వలన మగవాళ్లలో స్పెర్ం కౌంట్ తగ్గుతుంది. వీర్యకణాల సంఖ్య తగ్గడం వలన సంతాన ఉత్పత్తి సమస్య వస్తుంది. అలానే వీర్యకణాల నాణ్యత కూడా బాగా తగ్గుతుంది. ఫోన్ ని ఎక్కువసేపు మాట్లాడటం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. చాలామంది స్మార్ట్ ఫోన్ వలన క్యాన్సర్ బారిన పడుతున్నారు. స్మార్ట్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం వలన కార్పల్ టనల్ సిండ్రోమ్ వస్తుంది చేతి నొప్పి వచ్చి మనికట్టు నుండి మెదడుకు ఉండే నరాన్ని అది దెబ్బతీస్తుంది అలానే నోమొఫోబియా అంటే ఆత్రుత కూడా పెరుగుతుంది.
మానసిక ఆత్రుత ఫోన్ ఎక్కువ ఉపయోగిస్తే ఎక్కువవుతుంది. ఫోన్ బ్యాటరీ అయిపోయినా నెట్వర్క్ సరిగ్గా లేకపోయినా వీళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు. పరోక్షంగా కూడా స్మార్ట్ ఫోన్ వలన మనం ఇబ్బంది పడాలి ఉదాహరణకి మనం ఎక్కడైనా లోతు ప్రాంతాల్లో ఫోటోలు తీసుకోవడం లేదంటే డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటం వంటివి. మొబైల్ ఎక్కువ వాడటం వలన బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఉంది. మొబైల్ రేడియేషన్ మెదడులో రక్త ప్రసరణ పై ప్రభావం చూపిస్తుంది అతిగా ఫోన్ ఉపయోగిస్తే రక్తపోటు కూడా పెరుగుతుంది నిద్రలేమి సమస్య కూడా వస్తుంది.