విడాకులు తీసుకోనున్న స్నేహ..కారణం ఏంటంటే?

ఈ మధ్య సెలెబ్రేటి కపుల్స్ విడాకులు తీసుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే..ఏమైందో అనుకొనే లోపు విడిపోతున్న జంటలు ఎక్కువ అయ్యారు..తాజాగా హీరోయిన్ స్నేహ కూడా అదే బాటలో నడుస్తుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరోయిన్ లలో ఒకరు స్నేహ..తన అందం,నటనతో సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకుంది. గ్లామర్ పాత్రలు కాకుండా హోమ్లీ పాత్రలను ఎంచుకుంటూ ఫ్యామిలీ ఆడియన్స్ మనసు దొచుకుంది.

హీరోయిన్ సౌందర్య తర్వాత ఆ స్థాయిలో తెలుగు సినీ ప్రియుల మదిని దొచుకుంది స్నేహ. రాధ గోపాలం.. శ్రీరామదాసు వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళ్ భాషలలో నటిస్తూ కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే హీరో ప్రసన్న కుమార్ ను 2011లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి బాబు, పాప ఉన్నారు. పెళ్లి తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్నారు.. ఈ మధ్యనే రీఎంట్రీ ఇస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ.. అల్లు అర్జున్ నటించిన సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రాల్లో కీలకపాత్రలలో నటించి మెప్పించింది. అయితే కొద్ది రోజులుగా స్నేహ తన భర్తతో విడిపోయిందని వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి.

వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని.. త్వరలోనే వీరు విడాకులు కూడా తీసుకోబోతున్నట్లుగా వినిపించాయి. అయితే తమ బంధం గురించి వస్తున్న రూమర్స్ పై ఎట్టకేలకు హీరోయిన్ స్నేహ స్పందించింది. తన భర్త ప్రసన్న చెంపపై ముద్దు పెడుతూ ఓ సెల్ఫీ తీసి మరీ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది..ఈ పోస్ట్ తో అందరి నొర్లూ మూత పడినట్లే..దీంతో అందరికి ఒక క్లారిటీ వచ్చింది..ప్రస్తుతం ఈ పోస్ట్ ట్రెండ్ అవుతుంది..

https://www.instagram.com/p/CkF10FVSbGe/?igshid=YmMyMTA2M2Y=