గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో పొగమంచు.. గాల్లోనే చక్కర్లు కొడుతున్న విమానాలు

-

కృష్ణా జిల్లాలోని గన్నవరం విమానాశ్రయాన్ని పొగ మంచు కమ్మేసింది. ఈ ప్రభావంతో ఎయిర్‌పోర్ట్ లో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ పొగ మంచు కారణంగా పలు విమానాలు గాల్లోనే చక్కెర్లు కొట్టాయి. ఢిల్లీ నుండి గన్నవరం విమానాశ్రయంకి రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం లాడింగ్ కి అనుకూలించక గాల్లో చక్కర్లు కొట్టింది. హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయంకి రావాల్సిన ఇండిగో విమానం, బెంగళూరు నుండి గన్నవరం విమానాశ్రయంకి రావలసిన ఇండిగో విమానం కూడా గాల్లో చక్కర్లు కొట్టింది. మూడు విమానాలు గాల్లో చక్కర్లు కొడుతుండటంతో విమానంలోని ప్రయాణికులు కొంతసేపు ఆందోళనకు గురయ్యారు.

రన్‌వేపై పొగమంచు ఎక్కువగా ఉండడంతో విమానాల ల్యాండ్ కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పొగమంచు కారణంగా పలు విమాన సర్వీసులకు అంతరాయం కలిగిందని ఎయిర్‌పోర్టు అధికారలు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు. పొగ మంచు పరిస్థితులు చక్కబడ్డాక విమానాల ల్యాండింగ్‌కు తిరిగి అనుమతి ఇస్తామంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news