“మా” అసోసియేషన్ సభ్యులకు మంచు విష్ణు శుభవార్త.. వారికి వైద్య సదుపాయాలు

-

మా ఆర్టిస్టు అసోసియేషన్ సభ్యులకు అధ్యక్షుడు మంచు విష్ణు తీపి కబురు అందించారు. తాను ఎన్నికల ముందు మ్యానిఫెస్టోలో పొందుపరిచిన… హామీల దిశగా మంచు విష్ణు అడుగులు వేస్తున్నారు. మా అసోసియేషన్ సభ్యుల ఆరోగ్యం నేపథ్యంలో పలు ఆసుపత్రుల తో ఒప్పందం కుదుర్చుకున్నారు మంచు విష్ణు. ఇందులో భాగంగానే మా సభ్యులకు ప్రతి మూడు నెలలకు హెల్త్ చెకప్ లు ప్రముఖ ఆసుపత్రుల తో… ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నిర్ణయంతో ఆస్పత్రుల్లో ఎలాంటి వైద్యానికి అయిన మా అసోసియేషన్ సభ్యులకు రాయితీ లభించనుందని మంచు విష్ణు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

అంతే కాదు మహిళలకు ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పించనున్నట్లు స్పష్టంచేశారు మంచు విష్ణు. హైదరాబాద్ లో ఉన్నటువంటి కిమ్స్, అపోలో, మెడికవర్ అలాగే ఏఐజీ ఆస్పత్రిలో తో తాము ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంచు విష్ణు స్పష్టం చేశారు. మా సభ్యులకు రాయితీలు ఇవ్వడానికి ముందుకు వచ్చిన ఆసుపత్రి బృందానికి మంచు విష్ణు స్పెషల్ థాంక్స్ చెప్పారు. ఈ మేరకు తన ట్విట్టర్ వేదికగా ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు. కాగా అక్టోబర్ 10వ తేదీన జరిగిన మా అసోసియేషన్ ఆర్టీసీ ఎన్నికల్లో… ప్రకాశ్ రాజ్ ప్యానల్ పై మంచు విష్ణు ప్యానల్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news