విషం కక్కుతున్న సోషల్ మీడియా… ఎందుకీ దరిద్రం…!

-

కరోనా వైరస్ విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఇప్పుడు నిజంగా భయపెడుతున్నాయి. దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో ఉందీ అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. అన్ని రాష్ట్రాలు కూడా కరోనా వైరస్ తీవ్రతకు నానా అవస్థలు పడుతున్నాయి అనే విషయం కూడా అర్ధమవుతుంది. అయినా సరే సోషల్ మీడియాలో జరుగుతున్న కొన్ని ప్రచారాలు ఇప్పుడు ప్రజలను తీవ్రంగా భయపెడుతున్నాయి అనేది స్పష్టంగా అర్ధమవుతుంది. చిన్న చిన్న విషయాలను సోషల్ మీడియాలో పెద్దవిగా చేసి చూపించే ప్రయత్నం జరుగుతుంది.

ఏ చిన్న సంఘటన జరిగి మనిషి చనిపోయినా జంతువు చనిపోయినా సరే కరోనా కారణంగా చనిపోయారు అంటూ వార్తలు రాస్తున్నారు. అదే విధంగా పాలనా ప్రాంతంలో కరోనా తీవ్రంగా ఉందని అక్కడ అందరికి కరోనా వచ్చింది అంటూ కొందరు అతి గాళ్ళు ప్రచారం చేస్తున్నారు. దేశంలో కోటి మంది చచ్చిపోతున్నారని ప్రభుత్వాలు నిజాలు దాస్తున్నాయని హైదరాబాద్ మొత్తం కరోనా ఉందని లేకి వార్తలు ప్రచారం చేస్తున్నారు. కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ లో వెయ్యి మంది చచ్చిపోయారని ప్రభుత్వం చెప్పడం లేదని అంటూ ప్రచారం మొదలయింది.

ఇక మన దేశంలో మందుల కొరత తీవ్రంగా ఉందని, వైద్యులు భయపడుతున్నారని కూడా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. మందుల కొరత ప్రస్తుతానికి లేదు. అయినా సరే సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్తలు ఎక్కువగా హడావుడి చేస్తున్నాయి. దీనితో ప్రజలు భయపడుతున్నారు. కోడి వలన, క్యాబేజీ వలన, కోడి గుడ్డు వలన కరోనా వస్తుంది అంటూ అనవసర ప్రచారాలు అన్నీ చేస్తుంది సోషల్ మీడియా. లాక్ డౌన్ ని పోడిగిస్తారని, కచ్చితంగా ఆరు నెలలు లాక్ డౌన్ ఖాయమని కూడా వార్తలు రాయడం తో ఇప్పుడు ఎం జరుగుతుందో ఎవరికి అర్ధం కావడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news