అల్లు అర్జున్ కోసం ఏదైనా చేస్తానంటున్న హాట్ బ్యూటీ.. !

-

టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన లోఫర్ సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది దిశ పఠాని. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర చతికిల పడింది. మమచి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనింగ్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికి వసూళ్ళ పరంగా మాత్రం మేకర్స్ కి నిరాశనే మిగిల్చింది. అంతేకాదు వరుణ్ తేజ్ కూడా పూరి సినిమాతో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకోవాలని అనుకున్నాడు. కాని అది సాధ్యపడలేదు. ఇక ఈ సినిమా గనక సూపర్ హిట్ అయి ఉంటే టాలీవుడ్ లో దిశా పఠాని స్టార్ హీరోయిన్ గా పాపులర్ అయ్యోది.

 

అయితే దిశా పఠాని బాలీవుడ్ లో వరుసగా సూపర్ హిట్ సినిమాలలో అవకాశాలు దక్కించుకొని బాగా బిజీగా మారిపోయింది. బాయ్ ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్ తో రిలేషన్ మేయిన్‌టైన్ చేస్తూనే ఇద్దరూ కలిసి సినిమాలలో జంటా నటిస్తున్నారు. అంతేకాదు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు బాగా హిట్ అయ్యాయి. ఇక బాలీవుడ్ సినిమాలు కాబట్టి గ్లామర్ పాత్రలకి, అందాల ఆరబోతకి ఏమాత్రం అడ్డు చెప్పకుండా కావలసినంత చూపించి హీటెక్కిస్తోంది.

ఇక సినిమాలే కాదు సోషల్ మీడియాలోను దిశా తన గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఫ్యాన్స్ కి వేడిపుట్టిస్తోంది. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోస్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ హాట్ బ్యూటి మనసు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మీద పడింది. తన సినిమాలని, తన డాన్స్ ని బాగా పొగిడేస్తుంది. అంతేకాదు ఒకవేళ టాలీవుడ్ నిర్మాతలు గనక ఛాన్స్ ఇస్తే అల్లు అర్జున్ సరసన నటించడానికి రెడీగా ఉందట. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘రాధే’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి ప్రముఖ కొరియో గ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవ దర్శకత్వం వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news