ఇదేం పిచ్చో: బ్యాక్‌గ్రౌండ్ ఎఫెక్ట్ కోసం అడవికి నిప్పంటించిన టిక్‌టాక్ స్టార్..!!

-

కరోనా లాక్‌డౌన్ సమయంలో సోషల్ మీడియా వాడకం అధికమైన విషయం అందరికీ తెలిసిందే. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచాన్నే చుట్టేయొచ్చని భావనలో కొందరు బతికేస్తున్నారు. అరక్షణం తీరిక లేకుండా సోషల్ మీడియాలో వీడియోలు, సెల్ఫీలు, డ్యాన్సులు, షార్ట్ వీడియోలు, డబ్ స్మాష్‌లు చేస్తూ ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుంటారు. అయితే సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలొయింగ్ చాలా అవసరం. కొందరు సోషల్ మీడియా స్టార్లు తమ అభిమానులను ఎంటర్‌టైన్‌మెంట్ చేయడానికి సకల ప్రయత్నాలు చేస్తుంటారు. పబ్లిసిటి కోసం శ్రుతి మించిన అరాచక పనులు కూడా చేస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే పాకిస్థాన్‌లో చోటు చేసుకుంది.

tik tok
tik tok

పాకిస్థాన్‌కు చెందిన ఓ సోషల్ మీడియా స్టార్ చేసిన నిర్వాకం అంతా.. ఇంతా.. కాదు. వీడియో బ్యాక్‌గ్రౌండ్ ఎఫెక్ట్ కోసం ఏకంగా ఒక పెద్ద అడవినే నిప్పంటించింది. దీంతో ఈ వార్త ప్రస్తుతం ట్రెండింగ్‌గా నిలిచింది. ఆ నటి చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 15 సెకన్ల టిక్‌టాక్ వీడియో కోసం ఏకంగా పెద్ద అడవినే తగలబెట్టింది. దీంతో ఆ స్టార్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. హుమైరా అస్గర్ అనే సోషల్ మీడియా స్టార్.. సిల్వర్ కలర్ డ్రెస్ వేసుకుని కాలుతున్న అడవిలో సరదాగా నడుస్తున్న వీడియోను షేర్ చేసింది. దీనికి ‘నేను ఎక్కడుంటే.. అక్కడ మంటలు చెలరేగుతాయి.’ అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది. అయితే, ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఆమెతోపాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news