IPL 2022 : ముంబై బ్యాటర్ కోసం ఘోరంగా ఏడ్చేసిన సారా..!

-

డూ ఆర్‌ డై మ్యాచ్‌ లో ముంబైపై హైదరాబాద్‌ గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌ లో ముంబై పై హైదరాబాధ్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 7 వికెట్లు కోల్పోయి.. 190 పరుగులకే పరిమితమైంది. రోహిత్‌ శర్మ 48 పరుగులు, ఇషాన్‌ కిషన్‌ 43 పరుగులు, డేవిడ్‌ 46 పరుగులు చేసి.. ధాటిగా ఆడటంతోఓ దశలో హైదరాబాద్‌ పై ముంబై విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు.

అయితే.. భువనేశ్వర్‌ 1 వికెట్, ఉమ్రాన్‌ మాలిక్‌ 3 వికెట్లు పొదుపుగా బౌలింగ్‌ చేయడం కారణంగా హైదరాబాద్‌ విజయ పతాకం ఎగురవేసింది. అయితే.. ఈ మ్యాచ్‌ లో 18 బంతుల్లో 46 పరుగులు చేసి.. దుమ్ములేపాడు ముంబై ఆటగాడు టిమ్‌ డేవిడ్‌. అయితే.. చివర్లో డేవిడ్‌ రనౌట్ కావడంతో.. ముంబై ఓడిపోయింది. దీంతో.. ముంబై ఫ్యాన్స్‌ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే.. స్టాండ్స్‌ లో ఉన్నటువంటి సారా టెండూల్కర్‌ కూడా భావోద్వేగానికి లోనై ఏడ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news