భార్యను చంపి సూట్ కేసులో ప్యాక్ చేసి చెరువులో పడేసిన సాఫ్ట్‌ వేర్ ఉద్యోగి

-

తిరుపతిలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సత్యనారాయణపురంలో ఓ వివాహిత అదృశ్యం కేసును స్థానిక పోలీసులు ఛేదించారు. పద్మ అనే వివాహితను తన భర్తే హత్య చేసినట్లు పోలీసులు తేల్చి చెప్పారు. అలాగే నగర శివారులోని వెంకటాపురం చెరువులో ఆమె మృతదేహాన్ని గుర్తించినట్లు తెలిపారు.

వేణుగోపాల్-పద్మ
వేణుగోపాల్-పద్మ

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతిలోని సత్యనారాయణపురంలోని సాఫ్ట్ వేర్ ఉద్యోగి వేణుగోపాల్‌తో పద్మకు 2009లో వివాహం జరిగింది. కొన్నేళ్లపాటు వీరి కాపురం సజావుగా సాగినా.. ఆ తర్వాత ఇంట్లో కుటుంబ కలహాలతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరగడం మొదలయ్యాయి. ఈ క్రమంలో దిశ పోలీస్ స్టేషన్‌లో వేణుగోపాల్‌పై పద్మ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు వేణుగోపాల్, అతడి కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు.

అనంతరం కొద్ది రోజులపాటు వీరి కాపురం బాగానే కొనసాగినా.. మళ్లీ గొడవలు ప్రారంభం అయ్యాయి. దీంతో పద్మ తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత వేణుగోపాల్ తన అత్తమామలకు నచ్చజెప్పి మళ్లీ పద్మను ఇంటికి తీసుకొచ్చాడు. జనవరి 5వ తేదీన పద్మను అతి కిరాతకంగా చంపేసి.. సూట్‌కేసులో ప్యాక్ చేసి తిరుపతి శివారులోని వెంకటపురం చెరువులో పడేశాడు.

అనంతరం హైదరాబాద్ వెళ్లి పోయి.. పద్మ తనతోనే ఉన్నట్లు వేణుగోపాల్ నమ్మించాడు. అయితే ఐదు నెలలు అయినా.. పద్మ తమతో మాట్లాడలేదని తల్లిదండ్రులను అనుమానం వచ్చి తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ జరిపిన పోలీసులకు వాస్తవం తెలిసింది. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news