నేడు ఇండియాలో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది. 22 ఏళ్ల తర్వాత అరుదైన సూర్యగ్రహణం ఏర్పడనుంది.22 ఏళ్ల తర్వాత అరుదైన కేతుగ్రస్తా సూర్యగ్రహణం నేడే ఏర్పడింది. సాయంత్రం 4.29 గంటలకు ప్రారంభమై, 1.15 గంటలపాటు సూర్యగ్రహణం ఉంటుందని పంచాంగ కర్తలు చెబుతున్నారు.
అయితే ఈ పాక్షిక సూర్యగ్రహణం కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. మనదేశంలో గరిష్టంగా ఒక గంట 45 నిమిషాల పాటు పాక్షిక సూర్యగ్రహణం కనబడుతోంది. అందులో ఎక్కువ సమయం గుజరాత్ లోని ద్వారకాలో కనివిందు చేయనుంది.
ఢిల్లీలో సాయంత్రం 4:28 గంటల నుంచి 5:30 గంటల వరకు సూర్యగ్రహణం కనిపించనుంది. ఇక హైదరాబాద్ మహానగరంలో సాయంత్రం నాలుగు గంటల 59 నిమిషాలకు గ్రహణం కనిపించనుంది. 43 నిమిషాల పాటు కనువిందు చేయనుంది. గ్రహణ సమయంలో 43% సూర్యుడు అస్పష్టంగా కనిపిస్తాడు.