సోలార్ మెటీరియల్ నిందితుడు ఐలేష్ కస్టడీ పూర్తి

-

సోలార్ ప్యానల్ మెటీరియల్ సప్లై చేస్తానని నమ్మించి మోసం చేసిన ఓ వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అతడిని గుజరాత్ కు చెందిన ఐలేష్ గా గుర్తించారు. గుజరాత్ లోని సూరత్ లో సోలార్ ప్యానల్ కంపెనీ నడుపుతున్నాడు ఐలేష్. ఈ కేసులో నిందితుడు ఐలేష్ కస్టడీ పూర్తయింది. రెండు రోజుల కస్టడీ అనంతరం తిరిగి కోర్టులో హాజరు పరిచారు సిసిఎస్ పోలీసులు. సోలార్ ప్యానల్ మెటీరియల్ సప్లై చేస్తామని నమ్మించి 8 కోట్ల 70 లక్షల రూపాయలు మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.

గొలుసు దొంగలు-పోలీసుల దాడి

హైదరాబాద్ కి చెందిన బాధితులు కొద్ది రోజుల క్రితం సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుజరాత్ రాష్ట్రం సూరత్ కి చెందిన ఐలేష్ ను ముంబైలో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు సిసిఎస్ పోలీసులు. అతని వద్ద నుండి 38 లక్షల నగదు స్వాధీనం చేసుకొని.. అతని బ్యాంకు ఖాతాలు, బినామీ ఖాతాలలో ఉన్న ఎనిమిది కోట్ల రూపాయలను పోలీసులు సీజ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news