ఆ సిట్టింగులకు కేసీఆర్ షాక్..సీటు లేనట్లే.!

-

మరోసారి సిట్టింగులకే సీట్ల అంశంలో కే‌సి‌ఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పలుమార్లు సిట్టింగులకు సీట్లు ఫిక్స్ అని మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే అందరు సిట్టింగులకు సీట్లు ఇస్తే బి‌ఆర్‌ఎస్ మునగడం ఖాయం..ఎందుకంటే దాదాపు 30 మంది పైనే ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ వారందరికి సీట్లు ఇస్తే ఓటమి ఖాయమని అంటున్నారు. కాకపోతే ఎమ్మెల్యేలు జారిపోకుండా ఉండాలని చెప్పి కే‌సిఆర్..సిట్టింగులకు సీట్లు అని ప్రకటించారు.

ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు బి‌జే‌పితో టచ్ లో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు జంప్ అవ్వకుండా ఉండాలని చెప్పి..అందరికీ సీట్లు ఇస్తామని ప్రకటించారు. తాజాగా బి‌ఆర్‌ఎస్ విస్తృత స్థాయిలో సమావేశంలో కూడా అదే తరహాలో ప్రకటన చేశారు. కాకపోతే ఈ సారి కొందరు ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉందని చాలాసార్లు హెచ్చరించానని, కొందరు మారారని, మరికొందరు నేటికీ మేల్కొనలేదని అన్నారు.

kcr

మీ నిర్లక్ష్యంతో చేతులారా మీరు పోగొట్టుకుంటే తప్ప.. 99.9 శాతం సిటింగ్‌లకే సీట్లు దక్కుతాయని, డిసెంబరు కంటే ముందే నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉందని, సమయం లేనందున.. ఇప్పటినుంచే ప్రజాక్షేత్రంలో ఉండండని సూచించారు. నియోజకవర్గాల్లో గ్రూపులుగా ఏర్పడటం పార్టీకి, మీకూ మంచిది కాదని, మీ పరిధిలోని అన్ని స్థాయిల నేతలను కలుపుకొనిపోయి పనిచేయండని ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ నిర్దేశించారు.

ముఖ్యంగా ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కొందరు ఎమ్మెల్యే ల పనితీరు పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఆ జిల్లాల్లో కొందరు ఎమ్మెల్యేలకు సీట్లు డౌటే అని చెప్పవచ్చు. అందరికీ సీట్లు ఇస్తే బి‌ఆర్‌ఎస్ పార్టీకే నష్టం. కాబట్టి కే‌సి‌ఆర్ టికెట్లు ఇచ్చే విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తారని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news