శ్రీశైలం ఘటనపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు..త్వరలోనే పర్యటిస్తా !

-

శ్రీశైలం ఘటనపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలంలో టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన ఎమ్మెల్యే ఇద్దరు వ్యక్తులను సమర్ధిస్తున్నారని.. శ్రీశైలం లో నిన్న జరిగిన గలాటాపై మా బృందం ఎనిమిది పేజీల నివేదిక అందచేసిందని పేర్కొన్నారు. శ్రీశైలంకు మహారాష్ట్ర, కర్ణాటక భక్తులు వస్తే భోజనాలు ఆపేయమంటున్నారని… భక్తులకు శ్రీశైలంలో సౌకర్యాలు ఎందుకు చేయడం లేదు.. ఈవో స్పందించరా..? అని నిలదీశారు.

ఈశ్వరుడు అంటే మాకు భక్తి.. అమ్మవారు అక్కడ ఉన్నారని.. కర్ణాటక భక్తులను కొట్టిన వ్యక్తి ఇతర మతస్ధుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలంలో దుకాణంలోని వ్యక్తి వద్ద గొడ్డలి ఉంటే పోలీస్ వ్యవస్ధ ఏం చేస్తుందని.. వైసీపీ ప్రభుత్వ చెంచా గాళ్ల శిల్ప చక్రపాణి లాంటి వ్యక్తులు హిందూ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కూకటి వేళ్లతో పెకలిస్తామని హెచ్చరించారు.

నివేదిక ఆధారంగా త్వరలోనే శ్రీశైలం వెళతాం.. అక్కడ భక్తుల ఇబ్బందులు ఇతరత్రా అంశాలపై గళమెత్తుతామని… రామచంద్రాపురంలో హిందువులపై కేసులు పెడతామని పోలీసులు బెదిరిస్తున్నారని ఆగ్రహించారు. రామాలయంలో కూటం పెట్టామని వాగ్ధానం చేశారని.. హిందువులకు బాసటగా బీజేపీ రామచంద్రాపురంలో నిలబడిందన్నారు. గుంటూరులో జిన్నా టవర్స్ పేరు మార్చాల్సిందేనని.. గుంటూరులో 4వ తేదీన సమావేశం పెట్టి కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news