హాట్ టాపిక్: చిరంజీవితో వీర్రాజు భేటీ… ఇదే నెక్స్ట్ డ్యూటీ!

-

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు దూకుడు పెంచారు. మొదటిరోజు బాధ్యతలు స్వీకరించినప్పటినుంచి తనదైన స్టైల్లో దూసుకుపోతున్నారు. అటు పార్టీలో ఉండే రెబల్స్ ని ఎక్కడికక్కడ కంట్రోల్ చేయడంతోపాటు.. మరీ తోక జాడించేవారికి షోకాజ్ లు కూడా పంపుతున్నారు! ఇదే క్రమంలో బాబు & కోలను ముప్పుతిప్పలు పెట్టేలా విమర్శలు చేస్తున్నారు! తాజాగా చిరంజీవిని కలిశారు. దీంతో వీర్రాజు టార్గెట్ క్లియర్ గా ఉందని, అడుగులు కూడా పక్కాగా పడుతున్నాయని విశ్లేషణలు సాగుతున్నాయి!

అవును… వీర్రాజు ఫస్ట్ టార్గెట్… కాపు సామాజికవ‌ర్గంలో సంపూర్ణ ‌స్థాయిలో ప‌ట్టు సాధించడం.. ఫలితంగా వారందరినీ ఒక్కతాటిపైకి తీసుకురావడం! అందులో భాగంగా తాజాగా మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారు సోము వీర్రాజు! దీంతో వీరిమధ్య ఏయే విషయాలపై చర్చలు జరిగాయనేదాన్ని ఊహించడం పెద్ద విషయం ఏమీ కాదనేది కొందరు విశ్లేషకుల మాటగా ఉంది!

ఏపీలో కాపు సామాజిక వ‌ర్గం బ‌లంగా ఉంది! కాకపోతే ఒకే పార్టీవైపు కాకుండా… కొంత వైసీపీ, మరికొంత టీడీపీల వైపు రెండుగా చీలిపోయింది. ఈ నేప‌థ్యంలో జనసేన వచ్చినా… అది చూపించిన ప్రభావం అతిస్వల్పం అన్న విషయం 2019 ఫలితాల్లో సుస్పష్టం! దీంతో సోము వీర్రాజు తన సామాజిక వ‌ర్గాన్నంతా ఏక‌తాటిపైకి తెచ్చే క్ర‌మంలో వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే చిరంజీవితో భేటీ కావ‌డాన్ని అర్థం చేసుకోవాల‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే… త‌న మిత్ర‌ప‌క్ష‌మైన జ‌న‌సేనాని అధ్య‌క్షుడు ప‌వ‌న్ ‌క‌ల్యాణ్ ‌నే సోము వీర్రాజు ఇంత వ‌ర‌కు క‌ల‌వ‌లేదు. నూత‌న అధ్య‌క్షుడిగా వీర్రాజు ఎంపికైన త‌ర్వాత ప‌వ‌న్ ట్విట‌ర్ వేదిక‌గా శుభాకాంక్ష‌లు చెప్పారే తప్ప మిత్రప‌క్ష పార్టీల నేత‌లుగా ప‌ర‌స్ప‌రం క‌లుసుకున్న దాఖ‌లాలు లేవు. ఈ నేప‌థ్యంలో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా చిరంజీనిని ఆయ‌న ఇంటికి వెళ్లి క‌లుసుకోవ‌డంతో ఈ భేటీ కాస్త హాట్ టాపిక్ అయ్యింది!!

Read more RELATED
Recommended to you

Latest news