నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మరోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలపై సోనియాను ఇవాళ ఈడీ ప్రశ్నించనుంది. సోనియాకు తోడుగా ఆమె కుమారుడు రాహుల్ గాంధీ కూడా ఈడీ కార్యాలయానికి వెళ్లారు.
మరోవైపు సోనియాపై ఈడీ విచారణను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద మహిళా కార్యకర్తలు నల్ల బెలూన్లు చేపట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈడీ అధికార దుర్వియోగాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలోనూ కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. కేంద్ర సర్కార్ విధానానికి వ్యతిరేకంగా గాంధీభవన్లో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, సీనియర్ నాయకుడు వి.హనుమంత రావు, షబ్బీర్ అలీ, మహేశ్ గౌడ్, ఇతర నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్కు భాజపా భయపడే ఈడీని పంపిస్తోందని హస్తం నేతలు అన్నారు.