Sonu Sood : శివ శంకర్ మాస్టర్ కు సోనూసూద్ ఆర్థిక సాయం

-

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కు కరోనా మహమ్మారి సోకి… ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిన సంగతి తెలిసిందే. గత నాలుగు రోజులుగా ఆయన హైదరాబాద్ ఏ ఐ జి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. 75 శాతం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కు గురైనట్లు వైద్యులు చెబుతున్నారు. శివ శంకర్ మాస్టర్ పెద్దకొడుకు కూడా కరోనా సౌదీ సీరియస్ గా ఉన్నట్లు సమాచారం అందుతోంది. అటు శివ శంకర్ మాస్టర్ భార్య కూడా కరోనా కారణం హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు.

చిన్నప్పుడు అజయ్ కృష్ణ ఒక్కడే ప్రస్తుతం ఆ కుటుంబ బాగోగులను చూసుకుంటున్నాడు. అలాగే తన కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా ప్రముఖులను కోరాడు అజయ్ కృష్ణ. ఇలాంటి తరుణంలోనే… హెల్పింగ్ స్టార్ సోనూసూద్.. శివ శంకర్ మాస్టర్ ఫ్యామిలీ కి ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా సోనూసూద్ తన ట్విట్టర్ వేదికగా ప్రకటన చేశారు. ” తాను ఇప్పటికే శివ శంకర్ మాస్టర్ ఫ్యామిలీ తో టచ్ లో ఉన్నాను. వారిని కాపాడుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. ఆందోళన అవసరం లేదు” అంటూ సోనూసూద్ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news